పెగడపల్లి, సెప్టెంబర్ 27 : తండ్రి సెల్ ఫోన్ కొన్విలేదని మనస్తాపం చెందిన 9వ తరగతి విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజరాంపల్లి గిరిజన తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్‌నాయక్-జయ కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నది. వీరికి ఇద్దరు కొడుకులు కాగా, పెద్ద కొడుకు సాయిగణేశ్ నాయక్ (14) రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
శనివారం ఉదయం సాయిగణేశ్ సెల్‌ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరాడు. “చిన్న పిల్లోడివి ఇప్పుడు నీకు ఫోన్ ఎందుకు” అని బెదిరించడంతో మనస్తాపం చెందిన సాయిగణేశ్ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.