బీసీ గురుకులంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
బీసీ గురుకులంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా సంగోజిపేటకు చెందిన హర్షిత్‌గౌడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పెద్దశంకరంపేట మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నాడు.
- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఘటన
నారాయణఖేడ్, అక్టోబర్ 31: బీసీ గురుకులంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా సంగోజిపేటకు చెందిన హర్షిత్‌గౌడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పెద్దశంకరంపేట మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నాడు. విద్యార్థి తనతోపాటు సెల్‌ఫోన్ తెచ్చుకుని వాడుతుండటంతో ఉపాధ్యాయులు గుర్తించి మొబైల్‌ను తీసుకొని ప్రిన్సిపాల్‌కు అప్పగించారు.
దీంతో భయపడిన విద్యార్థి హర్షిత్‌గౌడ్ శుక్రవారం సాయంత్రం బాత్రూమ్లోకి వెళ్లి ఫినాయిల్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. విషయం బయటపడటంతో తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేశ్ దవాఖానలో విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్ ప్రతిభ మాట్లాడుతూ.. విద్యార్థి వద్ద సెల్‌ఫోన్ దొరకడంతో భయపడి ఫినాయిల్ తాగినట్టు తెలిపారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

