స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు జీవోపై స్టే
రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లపై స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జీవో 205 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
- పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లపై స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జీవో 205 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల నుంచి సదరు జీవో ఆధారంగా 4 వారాలపాటు ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 19న ప్రభుత్వం జారీచేసిన జీవో 205ను, దాని ఆధారంగా 22న జారీచేసిన సర్యులర్‌ను సవాలు చేస్తూ 114 బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు దాఖలు చేసిన 2 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పీ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రివిలేజ్ ఫీజు పేరుతో చట్టవిరుద్ధంగా ప్రత్యేక వసూళ్లు చేసేందుకు వీల్లేదని, ఇదే విషయాన్ని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం నిర్ధారించాయని పేరొన్నారు. ఎక్సైజ్ శాఖ తరఫు న్యాయవాది ఏ జగన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం విధించే ఏ ఫీజునైనా చెల్లిస్తామంటూ పిటిషనర్లు ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రివిలేజ్ ఫీజు చెల్లింపునకు అంగీకరిస్తూ లేఖలు కూడా ఇచ్చారని తెలిపారు.
ఇప్పుడు స్పెషల్ ప్రివిలేజ్ ఫీజుపై కోర్టును ఆశ్రయించడం ఒప్పంద ఉల్లంఘనేనని పేర్కొంటూ.. ఫీజు విధించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టం చేశారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు విధింపునకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. అప్పటివరకు జీవో 205 ఆధారంగా పిటిషనర్ల నుంచి ఎలాంటి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

