చెరువు వద్ద నిర్మాణాల కూల్చివేత
రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద హైడ్రా అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించి వాటని పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. మధుర బార్ అండ్ రెస్టారెంట్‌కు చెందిన భారీ షెడ్‌తో పాటు రేకుల నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 400 గజాల స్థలంలో రేకుల షెడ్ నిర్మించి అందులో మద్యం సిట్టింగ్‌కు ఉపయోగిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీచేశారు.
- అధికారుల చర్యలపై యజమానుల ఆవేదన
రామంతాపూర్, అక్టోబర్ 31: రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద హైడ్రా అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించి వాటని పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. మధుర బార్ అండ్ రెస్టారెంట్‌కు చెందిన భారీ షెడ్‌తో పాటు రేకుల నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 400 గజాల స్థలంలో రేకుల షెడ్ నిర్మించి అందులో మద్యం సిట్టింగ్‌కు ఉపయోగిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీచేశారు. కూల్చివేతల సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, హైడ్రా డీఎస్పీ ఉమామహేశ్వరరావు, హైడ్రా ఎస్ఐ ముజాఫర్, ఉప్పల్ ఎస్ఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మరోవైపు ఆస్తి యజమానులు నర్సింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి అధికారుల చర్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దాదాపు 40 ఏండ్లుగా మున్సిపల్ పన్నులు, విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నామని, ఇన్నేండ్ల తర్వాత తమ నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ హద్దులను ముందుగా నిర్ధారించాలని కోరారు. ఈ వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు యథాతథ స్థితి పాటించాలని ఆదేశించినా కూల్చివేతలు చేపట్టారని బాధితులు ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

