పోలీసుల సొమ్ము కొట్టేసిన ఇద్దరి అరెస్టు!
పోలీసుల సంక్షేమ నిధి సొమ్మును కొట్టేసిన కేటుగాళ్లను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులైన డీసీపీ సీసీ మోసిన్, వినయ్ అనే మరో ఉద్యోగిని రిమాండ్‌కు పంపినట్టు సమాచారం.
- పోలీస్ సంక్షేమ నిధి డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించిన డీసీపీ సీసీ
- ‘నమస్తే తెలంగాణ’ కథనంతో వెలుగు చూసిన నిధుల గోల్మాల్
- సుమారు రూ.కోటి వరకు వడ్డీ సొమ్ము కొట్టేసినట్టు పోలీస్ అధికారుల వెల్లడి
- నిందితుడు మోసిన్‌కు సహకరించిన ఉన్నతాధికారుల వివరాలపై నిఘా
- సంబంధిత అధికారులను తప్పిస్తారా? శిక్షిస్తారా? అంటూ పోలీస్ వర్గాల్లో చర్చ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పోలీసుల సంక్షేమ నిధి సొమ్మును కొట్టేసిన కేటుగాళ్లను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులైన డీసీపీ సీసీ మోసిన్, వినయ్ అనే మరో ఉద్యోగిని రిమాండ్‌కు పంపినట్టు సమాచారం. ‘నమస్తే తెలంగాణ’లో గతనెల 24న ప్రచురితమైన ‘పోలీస్ సొమ్ము కొట్టేశాడు’ కథనంతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ అధికారులు విచారణకు దిగారు.
సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ సంక్షేమ నిధి ఖాతా నుంచి రూ.కోటి వరకు వడ్డీ సొమ్మును కొట్టేసినట్టు పోలీసులు గుర్తించారు. క్యాంప్ క్లర్క్. జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో ఉన్న మోసిన తన వద్ద ఉన్న చెక్‌బుక్ ద్వారా ఆ నగదు డ్రా చేసినట్టు గుర్తించారు. మోసిన్ వచ్చిన కొత్తలో ఎలా ఉన్నా ఆ తర్వాత కొందరు అధికారుల సహకారంతో ఈ సొమ్మును కొట్టేసినట్టు పోలీస్ అధికారులే అనుమానిస్తున్నారు. ఆ మేరకు విచారణ కొనసాగుతున్నట్టు తెలిసింది. తన దగ్గర ఉన్న చెక్‌బుక్ ద్వారా మూడుకోట్లకు పైగా కొట్టేసినట్టు పోలీసుల మధ్య చర్చ జరుగుతున్నది. చెక్‌బుక్‌పై పైఅధికారి సంతకం పెట్టాల్సి ఉండగా, ఈ నిధులు మోసిన్ ఎలా కొట్టేశారనే విషయంలో గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మోసిన్‌ను సుమారు 10 రోజుల పాటు విచారించారు.
డబ్బులు కట్టే విషయంలో ఆయనపై కేసు పెట్టకుండా కేవలం ఒత్తిడి చేసి డబ్బులు రాబట్టాలని చూసినా మోసిన్ వినకపోవడంతో ఈ విషయంపై అధికారులు తలలు పట్టుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ సీసీగా పనిచేసిన సమయంలోనూ మోసిన్ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు స్థానిక పోలీసులు చెప్పుకుంటున్నారు. మోసిన్ నిధులు కొట్టేయడానికి సహకరించిన వినయ్‌ను అరెస్టు చేసినప్పటికీ మిగతా అధికారుల విషయాన్ని తేలుస్తారా? లేక ఒక్క మోసిన్నే దోషిగా చూపించి వారిని తప్పించే ప్రయత్నం జరుగుతుందా? అంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

