న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో కోర్టులో భౌతిక విచారణకు అనుమతించాలని సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కోరారు. ఈ విజ్ఞప్తిపై సీజేఐ స్పందిస్తూ.. ‘ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్. ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చినప్పుడు నాలుగు రోజుల్లోనే నేను కోలుకొన్నా. కానీ, మూడో దశలో ఒమిక్రాన్ బారినపడి 25 రోజులుగా గడుస్తున్నా.. కరోనా అనంతర ప్రభావాలతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నా’ అని అన్నారు.