హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సినీ నిర్మాణాలకు వేదికలుగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నట్టు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి అశీశ్ శెలార్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలపై వారు చర్చించారు. అనంతరం మహారాష్ట్ర ఫిల్మ్‌సిటీని సందర్శించాలని కోమటిరెడ్డిని అశీశ్ శెలార్ ఆహ్వానించారు.