హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : క్రిస్మస్ అంటే ఐక్యతతోపాటు శాంతి, కరుణ, ప్రేమ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తాను క్రైస్తవ విద్యాసంస్థలో చదువుకున్నానని, ఆ సమయంలో ప్రతి ఏడాది క్రిస్మస్ను జరుపుకునే అవకాశం లభించిందని గుర్తుచేశారు.
మనోహరాబాద్, డిసెంబర్ 15 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కార్మికుల వివరాల ప్రకారం.. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో సోమవారం కార్మికులు పనిచేస్తుండగా ఇనుమును కరిగించే బట్టీలు ప్రమాదవశాత్తు పేలి పోవడంతో యూపీలోని కాన్పూర్‌కు చెందిన అనుసర్ (37) మృతిచెందాడు.
మరో ఇద్దరు బిహార్ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను యాజమాన్యం దవాఖానకు తరలించింది. అగర్వాల్ పరిశ్రమవల్ల వాయు కాలుష్యంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులు మృత్యువాత పడుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.