లక్నో: ఉత్తరప్రదేశ్లోని క్యాడ్బరీ చాక్లెట్ల గోడౌన్లో భారీ చోరీ జరిగింది. ఆ గోడౌన్లో ఉన్న సుమారు 17 లక్షల ఖరీదైన చాక్లెట్లను ఎత్తుకెళ్లారు. దీనిపై చిన్హట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు క్యాడ్బరీ డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర సింగ్ సిద్దూ తెలిపారు. ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు.