Chiranjeevi| కుర్ర హీరోలతో పోటీ పడుతూ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే తర్వాతి సినిమా డైరెక్టర్ని కన్ఫాం చేసేస్తున్నారు చిరు. ఈ మధ్య మెగాస్టార్ పాత దర్శకులితో కాకుండా యువ డైరెక్టర్స్‌తో కలిసి పని చేస్తున్నారు. కొత్త కథలతో వారు వస్తున్నారు. మూవీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది, అందుకే వారితో చేస్తున్నానని ఓ సందర్భంలో చెప్పారు. అయితే ప్రస్తుతం చిరంజీవి బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. . మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీని సోషియో ఫాంటసీగా ఈ మూవీ తెరకెక్కుతుంది.
గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాలి. కాని వీఎఫ్ఎక్స్ విషయంలో డిలే కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మూవీని ఏప్రిల్, మేలో విడుదల చేయాలని టీమ్ భావించిన చిత్రం మరికొన్ని రోజులు వాయిదా పడేలా కనిపిస్తుంది. ఆగస్ట్ లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా మూవీ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే డిలేకి కారణం వీఎఫ్ఎక్స్ అని తెలుస్తుంది. గతంలో ఓ కంపెనీకి ఇవ్వగా అవి సరిగా రాకపోవడంతో మూవీని మరి కొన్ని రోజులు వాయిదా వేయబోతున్నారట.
విశ్వంభర టీజర్ వచ్చాక చాలా మంది వీఎఫ్ఎక్స్ విసయంలో పెదవి విరిచారు. దీంతో చిరంజీవి విశ్వంభర చిత్రాన్ని కాస్త లేట్ అయిన మంచి క్వాలిటీతో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుంది. వీరితోపాటు ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ వంటి హీరోయిన్స్ కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. ఈ సినిమాని చిరంజీవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మూవీ తర్వాత చిరు అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు.