బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత అగ్ర హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘MEGA 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే ఈ సీక్వెన్స్‌లో చిరంజీవి శక్తివంతంగా, డైనమిక్ అవతార్‌లో కనిపిస్తారని, మెగాస్టార్ ఈ పోరాట సన్నివేశాల్లో స్వయంగా పాల్గొంటూ సాహసోపేతమైన ఫీట్స్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టైటిల్ టీజర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు మేకర్స్ చెప్పారు. చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: భాను-నందు, కథనం: కోన వెంకట్, కె.చక్రవర్తిరెడ్డి, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్.