రవితేజ సోదరుడు, రఘు కుమారుడు మాధవ్ హీరోగా రూపొందుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు కథానాయిక. మాంచాల నాగరాజు దర్శకుడు. మయూర్‌రెడ్డి బండారు నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో ‘మారి’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి స్వరపరచగా మంగ్లీ ఆలపించారు. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని, త్వరలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేస్తామని హీరో మాధవ్ తెలిపారు.
తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇదని, ఒక తెలంగాణ పల్లెటూరినీ, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని ఈ సినిమాలో చూస్తారని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల కథానాయిక దీపా బాలు ఆనందం వెలిబుచ్చారు. ఫస్ట్‌కాపీ సిద్ధమైందని, ఇది చాలా రూటెడ్ స్టోరీ అని, ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే సినిమా అవుతుందని దర్శకుడు మాంచాల నాగరాజు చెప్పారు. ఇంకా ఎడిటర్ సాయిబాబు, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి, బాలనటులు తమోజ్ఞ, సర్కార్ కూడా మాట్లాడారు.