టాలీవుడ్ (Tollywood) లో రాబోతున్న లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ (Most Eligible Bachelor). అఖిల్ అక్కినేని (Akhil Akkineni), పూజాహెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత ఫైనల్ గా దసరా కానుకగా అక్టోబర్ 8న థియేటర్లలో సందడి చేయనుంది. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రియల్ కపుల్ సందడి చేయబోతుండటం విశేషం.
ఇంతకీ వాళ్లెవరనే కదా మీ డౌటు. సింగర్ చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్ దంపతులు. ఈ ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రేమికులు సిల్వర్ స్క్రీన్ పై కలిసి మెరువబోతుండటం ఇదే తొలిసారి కానుండటంతో సినీ ప్రియులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రాహుల్-చిన్మయి ఆన్ స్క్రీన్ కెమస్ట్రీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై వాసు వర్మ, బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?