Chinese Woman | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన చైనా మహిళను అరెస్టు చేశారు. సరైన వీసా, పాస్పోర్టు పత్రాలు లేకుండా ఇండో – నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నించగా ఆమెను సశస్త్ర సీమా బల్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగింది.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో భారత్, నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్ నౌటన్వా ప్రాంతంలోని బైరియా బజార్ వద్ద కాలిబాట మార్గంలో చైనా మహిళ భారత్లోకి ప్రవేశించడం సశస్త్ర సీమా బల్ సిబ్బంది గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమెను అడ్డుకున్నారు. ఈ తనిఖీల్లో సదరు మహిళ దగ్గర సరైన వీసా, పాస్పోర్టు పత్రాలు లేవని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు.
ఆమె దగ్గర లభించిన ఒక చీటి ఆధారంగా చైనాకు చెందిన హుజియా జీగా గుర్తించామని నౌటన్వా పోలీసులు తెలిపారు. ఆమె చైనాలోని ఏ ప్రాంతానికి చెందిన మహిళ? భారత్కు రావడం వెనుక ఉద్దేశ్యమేంటనేది ఇంకా తెలియదని.. దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.