శ్రీనగర్: అమర్నాథ్ వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్ని రక్షించేందుకు చినార్ కార్ప్స్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. 15 కార్ప్స్లో లేదా చినార్ కార్ప్స్ బృందం ప్రస్తుతం అమర్నాథ్ వద్ద చిక్కుకున్న భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్.. కశ్మీర్ లోయలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. శుక్రవారం సాయంత్రం అకస్మిక వరదతో అమర్నాథ్ యాత్రికులు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 15 మంది భక్తులు మృతిచెందారు. మరో 40 మంది యాత్రికులు మిస్సింగ్ జాబితాలో ఉన్నారు.
#ChinarCorps Cdr on ground zero, amidst #Yatris rescued by #IndianArmy.#support#SANJY2022#AmarnathYatra2022#AmarnathCaveCloudBurst@manishindiatv@AdityaRajKaul@OfficeOfLGJandK@JmuKmrPolice@KashmirPolice@crpfindia@crpf_srinagar@BSF_Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/Z1sEn1ffd9
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) July 9, 2022
అయితే ఇవాళ ఉదయం చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏడీఎస్ ఔజా అక్కడికి చేరుకున్న పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. క్లౌడ్బస్ట్తో కొట్టుకుపోయిన ప్రాంతాలను ఆయన విజిట్ చేశారు. యాత్రికులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను కనుకున్నారు. ప్రస్తుతం అమర్నాథ్ వద్ద ఈయన సారథ్యంలోనే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నది.
#AmarnathYatra2022 #SANJY2022 #AmarnathCaveCloudBurst #AmarnathCloudburst #AmarnathYatris @adgpi@NorthernComd_IA pic.twitter.com/BGVJPwQfrg
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) July 9, 2022
క్లౌడ్‌బస్ట్ జరిగిన ప్రాంతం నుంచి 29 మందిని రక్షించినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారులు తెలిపారు. ఆ భక్తుల్లో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. వరద నీటితో కొట్టుకువచ్చిన శిథిలాలను చినార్ కార్ప్స్ సైనికులు తొలిగిస్తున్నారు. గల్లంతు అయిన వారి కోసం కార్ప్స్ తీవ్రంగా గాలిస్తున్నారు. చినార్ కార్ప్స్ దళాలు అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్‌తో వరద ప్రభావిత ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నారు.
#AmarnathYatra2022 #SANJY2022 #AmarnathCaveCloudBurst #AmarnathCloudburst #AmarnathYatris @adgpi@NorthernComd_IA pic.twitter.com/h35r7z3hrH
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) July 9, 2022
అమర్నాథ్ వరదల్లో 16 మంది మృతిచెందినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ తెలిపారు.
#Amarnath cloudburst | Indian Army employing sophisticated rescue equipments and trained professionals on-site: Chinar Corps, Indian Army pic.twitter.com/iIRSJxZskg
— ANI (@ANI) July 9, 2022