వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో చైనా భారీగా అణ్వాయుధాలను పోగేసుకొంటున్నది. 2030 నాటికి ప్రయోగించటానికి సిద్ధంగా ఉండే వెయ్యి అణ్వాయుధాలను చైనా సిద్ధం చేసేందుకు ప్రణాళికలు వేసిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ తన రిపోర్టులో వెల్లడించింది. 2027కల్లా 700 అణు వార్‌హెడ్స్‌ను తయారుచేయాలన్న లక్ష్యంతో చైనా పని మొదలుపెట్టిందని వివరించింది.చైనా వద్ద 400 అణు వార్‌హెడ్స్ మాత్రమే ఉన్నాయని ఇప్పటివరకు అంచనా ఉండేది.