గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి

బీజింగ్ : భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో నిజమైన విలన్‌కు ఫలితం దక్కింది. ఘర్షణకు మూలకారకుడైన జనరల్ జావో జోంగ్కికి జిన్‌పింగ్ ప్రభుత్వం ముఖ్యమైన స్థానాన్ని కల్పించింది. పీఎల్ఎకు చెందిన ఈ మాజీ టాప్ కమాండర్‌ను చైనా పార్లమెంట్ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్-ఎన్పీసీ) ప్రభావవంతమైన విదేశీ వ్యవహారాల కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. జనరల్ జావో రెండు దశాబ్దాలుగా భారత్‌తో టిబెట్ సరిహద్దు వెంబడి విధుల్లో ఉన్నారు. 65 ఏండ్ల వయసున్న జనరల్ జావో జోంగ్కి 2017 లో డోక్లాం ఘర్షణ సమయంలో వెస్ట్రన్ కమాండ్‌కు అధిపతిగా, 2020 లో లడఖ్ స్టాండఫ్లో ఉన్నారు.
పీఎల్ఏ నిబంధనల ప్రకారం, సైన్యం యొక్క టాప్ జనరల్ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. జనరల్ జావో నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు మార్చి 5 నుంచి జరుగనున్న ఎన్పీసీ వార్షిక సమావేశానికి ముందు అమలులోకి వచ్చాయి. ఎన్పీసీ, దాని సలహా సంస్థ అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతాయి. గల్వాన్ లోయలో దాడి చేయాలని చైనా సైన్యాన్ని ఆదేశించినది జనరల్ జావో కావడం విశేషం. జనరల్ జావో జోంగ్కి ఇప్పటికే భారత్‌తో గతంలో చాలా ఘర్షణలకు దిగిన ఆనవాళ్లు ఉన్నాయి. జావోతో పాటు ఇప్పటివరకు సాయుధ పోలీసు దళాలకు అధిపతిగా ఉన్న జనరల్ వాంగ్ నింగ్.. రాజ్యాంగం, చట్టంపై ఎన్పీసీ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. గల్వాన్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు హత్యకు గురవగా,, చైనాకు చెందిన 40 మంది సైనికులు చనిపోయారని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

