China | బీజింగ్: కొవిడ్-19 టీకా అభివృద్ధిలో పాలుపంచుకున్న టాప్ సైంటిస్ట్పై చైనా వేటేసింది. అవినీతి ఆరోపణలపై ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరించింది. ఆయన పేరు యాంగ్ షావోమింగ్. చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ వ్యాక్సిన్ సబ్సిడరీ అయిన చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్బీజీ)కి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనకు సంబంధించి తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో నేషల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.