హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలికను రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందన గౌడ్, బండి అపర్ణ, మరిపల్లి చందన గురువారం పరామర్శించారు. వైద్యులను అడిగి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన వైద్యసేవలన్నీ నిరంతరంగా అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ కమిషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సభ్యులు హామీ ఇచ్చారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్న నేపథ్యంలో అవసరమైన సహాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికకు కౌన్సెలింగ్, పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.