Rahul Gandhi : ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పై ఎన్నికల సంఘంలో (Election Commission) విభేదాలున్నట్లు వార్తలు రావడంతో.. లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commisioner) జ్ఞానేశ్ కుమార్ (Gynesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘ఓటు చోరీ’ ద్వారా ఎంపీలుగా గెలిచిన వారు చేసిన చట్టాలు చెల్లబోవని రాహుల్‌గాంధీ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఓటు చోరీ జరిగిన విషయాన్ని కాంగ్రెస్ లేవనెత్తిన తర్వాతే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎస్ఐఆర్పై సీఈసీకి అభ్యంతరం తెలిపారని అన్నారు. జ్ఞానేశ్‌కుమార్ అప్రూవర్‌గా మారాలని, అది దేశ ప్రయోజనాలకు మంచిదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత సీఈసీని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఎంపిక చేశారని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రస్తుత గందరగోళానికి ఆయనే కారణమని ఇద్దరు కమిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఎంపిక చేసిన వాళ్లే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.