వంగూరు, మార్చి 4: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెలరోజల కిందట మండలంలోని ఉమ్మాపూర్లో ఓ రైతుకు కనిపించిన చిరుత నాలుగురోజుల కిందట గాజర గ్రామానికి చెందిన మల్ల య్య అనే రైతుపై దాడి చేసి చేతిని తీవ్రంగా గాయపరిచింది. గురువారం రాత్రి కోనేటిపూర్లో సంచరిస్తుండగా ఓ వ్యక్తి ఫొటో తీశాడు. సమాచారం తెలుసుకున్న రేంజ్ ఆఫీసర్ రాజేందర్, ఎఫ్ఆర్వో పర్వేజ్అహ్మద్, డీఎఫ్ఆర్వో రేణుక ఆధ్వర్యంలో సిబ్బంది కోనేటిపూర్ శివారులోని సర్వాయికుంటలో నీళ్లు తాగడానికి వచ్చిన చిరుత జాడలను గుర్తించారు. చిరుతను పట్టుకోవడంలో భాగంగా శుక్రవారం పరిసర ప్రాంతాల్లో ఐదు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రేణుక తెలిపారు.