న్యూఢిల్లీ, నవంబర్ 26: పనిలో ఉన్నప్పుడో.. ప్రయాణం చేస్తున్నప్పుడో.. లేక విశ్రాంతి తీసుకుంటున్నప్పుడో కొంపలు మునిగిపోతున్నట్టు కాల్స్ వస్తూంటాయి. తీరా ఫోన్ ఎత్తి మాట్లాడితే.. అక్కడ ఆ ప్లాట్, ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అంటూ రకరకాల అడ్వైర్టెజ్మెంట్లు. ఇక ఇన్‌బాక్స్ నిండిపోయేలా ఎస్ఎంఎస్ల సంగతి సరేసరి. ఆ ఫోన్ కాల్స్‌ను ఎత్తలేక, ఈ మెసేజ్‌లను డిలీట్ చేయలేక మొబైల్ ఫోన్ యూజర్లు సతమతమైపోతున్నారంటే అతిశయోక్తి కాదు. మన లో చాలామందిదీ ఇదే పరిస్థితి.
ఇదీ సంగతి..
అవాంఛిత మొబైల్ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. అయితే కొత్తగా వస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్‌లు ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తాయనుకుంటే పారబాటే. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ ఈ టెక్నాలజీలనే వాడుతున్నారిప్పుడు. రోబోకాల్ వంటి టెక్నిక్స్‌ను ఉపయోగించి మొబైల్ ఫోన్ యూజర్లకు స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను చేస్తున్నారు మరి.
ఏం చేయాలి?
నిజానికి గత కొన్నేండ్లుగా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్.. మొబైల్ ఫోన్ వినియోగదారులను ఎంతగానో విసిగిస్తున్న ఈ అవాంఛిత కాల్స్, మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయాలని తీవ్రంగానే శ్రమిస్తున్నది. ఈ క్రమంలో వచ్చినదే ‘డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ)’ సదుపాయం. మీ మొబైల్ నెంబర్‌కు డీఎన్డీని యాక్టివేట్ చేయడం ద్వారా స్పామ్ కాల్స్, మెసేజ్‌ల సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే కొన్ని మొబైల్ ఫోన్స్‌లో మెసేజ్ యాప్‌లోనే వద్దనుకున్న మెసేజ్‌ను మార్క్‌చేసి వాటిని ఆపేసుకోవచ్చు.
జియో కస్టమర్లు
ఎయిర్టెల్ కస్టమర్లు
వీఐ కస్టమర్లు