INDW vs AUSW : భారత బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ బాదేసిన ఎలీసా హేలీ (142) ఎట్టకేలకు ఔటయ్యింది. భారీ షాట్లతో చెలరేగుతున్న ఆమెను తెలుగమ్మాయి శ్రీ చరణి వెనక్కి పంపింది. 38వ ఓవర్ ఐదో బంతికి హేలీ కవర్స్‌లో షాట్ ఆడింది. అక్కడే కాచుకొని ఉన్న స్నేహ్ రానా ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో ఒడుపుగా క్యాచ్ అందుకుంది. రీప్లేలోనూ ఫేర్ క్యాచ్ అని తేలడంతో ఆసీస్ కెప్టెన్ నిరాశగా పెవిలియను చేరింది.
ఛేదనలో ఆదినుంచి దూకుడుగా ఆడుతున్న హేలీ ఆసీస్‌ను విజయానికి చేరువ చేసింది. ఫొబె లిచ్‌ఫీల్డ్ (40)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తను.. ఆ తర్వాత అషే గార్డ్నర్()తో మరో విఉలవైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలోనే సెంచరీ సాధించిన హేలీ.. జోరు పెంచి స్నేహ్ రానా ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌తో అవసరమైన రన్‌రేట్‌ను ఆరుకు తగ్గించింది.
– The highest score in a chase vs India
– The highest score of this World CupAlyssa Healy, what a legend 🫡 pic.twitter.com/kVbdhfX2si
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
ఒంటిచేత్తో జట్టును గెలిపించేలా ఉన్న హేలీని చివరకు చరణి వెనక్కి పంపి టీమిండియాకు బిగ్ బ్రేకిచ్చింది. కీలక వికెట్ తీసిన చరణి.. 96 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని ముగించింది. 39 ఓవర్లకు కంగారూ టీమ్ స్కోర్ 265-4. ఇంకా విజయానికి 65 రన్స్ కావాలంతే. టీమిండియాకు ఆరు వికెట్లు అవసరం.