INDW vs AUSW : భారత స్పిన్నర్లు జోరుతో ఆస్ట్రేలియా మూడో వికెట్ పడింది. పవర్ ప్లే తర్వాత డేంజరస్ ఓపెనర్ ఫొబె లిచ్‌ఫీల్డ్ (40)ను ఔట్ చేసిన శ్రీచరణి (2-16) ఈసారి అనాబెల్ సథర్‌లాండ్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. వరుస ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు దీప్తి శర్మ ఓవర్లో మిడాన్ దిశగా షాట్ ఆడిన బేత్ మూనీ(4)ని డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది జెమీమా.
ఎలీసా పెర్రీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాక వచ్చిన మూనీని దీప్తి వెనక్కి పంపింది. ఆమె ఆడిన బంతిని గమనించిన జెమీమా ఎడమవైపు డైవ్ చేస్తూ రెండుచేతుల్తో క్యాచ్ అందుకుంది. దాంతో, 168 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే శ్రీచరణి వికెట్ తీయడంతో ఆసీస్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం కెప్టెన్ అలీసా హేలీ(93 నాటౌట్) సెంచరీకి చేరువవ్వగా.. అష్ గార్డ్నర్ 2 పరుగులతో క్రీజులో ఉంది. 28 ఓవర్లకు స్కోర్. 174/3. ఆసీస్ విజయానికి 157 రన్స్ కావాలి.
🚨 A flying Jemi has been spotted 🚨
Jemimah Rodrigues grabs a blinder to remove Beth Mooney 🔥
Watch #INDvAUS LIVE in your region, #CWC25 broadcast details here ➡️ https://t.co/7wsR28P7Sa pic.twitter.com/OzKLRZUKze
— ICC (@ICC) October 12, 2025