INDW vs AUSW : భారీ ఛేదనలో దంచేస్తున్న ఆస్ట్రేలియాకు షాక్. ఓపెనర్ల జోరుకు భారత స్పిన్నర్ శ్రీచరణి (1-1) బ్రేకులు వేసింది. డేంజరస్ ఫొబే లిచ్‌ఫీల్డ్(40)ను వెనక్కి పంపింది. పవర్ ప్లేలో రెచ్చిపోయిన లిచ్‌ఫీల్డ్ స్వీప్‌షాట్ ఆడబోయి లెగ్ సైడ్‌లో స్నేహ్ రానాకు క్యాచ్ ఇచ్చింది. దాంతో. 85 పరుగుల వద్ద ఆసీస్ మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ అలీసా హేలీ(49)కి జతగా ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ(5) ఉంది. 13 ఓవర్లకు కంగారూల స్కోర్.. 95/1.ఇంకా విజయానికి 236 రన్స్ కావాలి.
భారత్ నిర్దేశించిన 331 ఛేదనను ఆస్ట్రేలియా ఓపెనర్లు అలీసా హేలీ (49), ఫొబే లిచ్‌ఫీల్డ్(40)లు దూకుడుగా ఆరంభించారు. తొలి ఓవర్లో ఏడు రన్స్ వచ్చినా.. ఆ తర్వాత ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వరల్డ్ కప్‌లో భారత్ అస్త్రంగా రాణిస్తున్న క్రాంతి గౌడ్ ఓవర్లో హేలీ వరుసగా 6, 4, 4.. 4తో 19 పరుగులు పిండుకుంది.
Sree Charani provides the much-needed breakthrough for India, Phoebe Litchfield goes for 4⃣0⃣
📸: JioHotstar#CWC2025 #INDWvsAUSW #TeamIndia #CricketTwitter pic.twitter.com/xTjgtddBgG
— InsideSport (@InsideSportIND) October 12, 2025
ఆ తర్వాత అమన్‌జోత్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో లిచ్‌ఫీల్డ్ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగింది. ఆ తర్వాతి బంతికి స్టంపౌట్ కావాల్సింది. కానీ, రీచా ఘోష్ బంతిని అందుకోలేకపోవడంతో బతికిపోయిన ఈ యంగ్‌స్టర్ స్ట్రెయిట్ బౌండరీతో స్కోర్ 80 దాటించింది. దాంతో, పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 82 పరుగులు చేసింది. కానీ, ఆ తర్వాతి ఓవర్లోనే శ్రీ చరణి భారత్‌కు బ్రేకిస్తూ వికెట్ తీసింది.