INDW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) దంచికొట్టడంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 155 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (33), రీచా ఘోష్ (32)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో స్కోర్ 300 దాటించారు.
అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉండడంతో స్కోర్ 350 దాటడం ఖాయమనిపించింది. కానీ, రీచా, జెమీమాతో పాటు టెయిలెండర్లు అనవసర షాట్లకు యత్నించి చకచకా పెవిలియన్ చేరారు. 49వ ఓవర్లో క్రాంతి గౌడ్ వికెట్ తీసిన సథర్లాండ్ ఆ తర్వాతి బంతికే శ్రీచరణిని క్లీన్ బౌల్డ్ చేయడంతో 330 వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ప్రపంచ కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
HER FIRST ODI FIVE-FOR!
Annabel Sutherland rises to the occasion in a big World Cup game 👏 🔥 pic.twitter.com/1lpbKLdiHD
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
వరల్డ్ కప్‌లో వరుసగా రెండు విజయాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో కంగుతిన్న టీమిండియా వైజాగ్‌లో భారీ స్కోర్ చేసింది. టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాపై ఓపెనర్లు స్మృతి మంధాన(80 : 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రతీకా రావల్(75 : 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్)లు అర్ధ శతకాలతో చెలరేగి కంగారూలను హడలెత్తించారు. పవర్ ప్లేలో 58 రన్స్ పిండుకున్న ఈద్వయం ఆ తర్వాత టాప్‌గేర్‌లో ఆడి స్కోర్ బోర్డును ఉరికించింది. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన మంధాన పేసర్ తహ్లియా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సిక్సర్ బాదింది. ఆ తర్వాత మొలినెక్స్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి టైమింగ్ కుదరక బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ చేతికి చిక్కింది. దాంతో, 155 పరుగుల వద్ద టీమిండియ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత అనాబెల్ సథర్లాండ్ ఓవర్లో ప్రతీకా సైతం వెనుదిరింది.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠! #TeamIndia post a formidable 330 on the board! 💪
8️⃣0️⃣ for vice-captain Smriti Mandhana
7️⃣5️⃣ for Pratika Rawal
Crucial 3️⃣0️⃣s from Harleen Deol, Richa Ghosh & Jemimah RodriguesOver to our bowlers now. 👍
Scorecard ▶ https://t.co/VP5FlL2S6Y… pic.twitter.com/KOpyOAfjjT
— BCCI Women (@BCCIWomen) October 12, 2025
అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(22), హర్లీన్ డియోల్(38) దూకుడుగా ఆడారు. కానీ, 6 పరుగుల వ్యవధిలోఇద్దరూ ఔటయ్యారు. ఆ దశలో40 వ నుంచి జెమీమా రోడ్రిగ్స్ (33), రీచా ఘోష్(32)లు ధనాధన్ ఆడారు. స్ట్రయిట్ రొటేట్ చేస్తూ.. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తిస్తూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. సథర్లాండ్ వేసిన 43వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ కొట్టబోయిన రీచా వరేహంకు దొరికింది. అక్కడి నుంచి భారత జట్టు వికెట్ల పతనం మొదలైంది. బౌండరీలతో అలరించిన జెమీమాను సథర్లాండ్ బోల్తా కొట్టించగా.. దీప్తి శర్మ, స్నేహ్ రానాలు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో.. 350 ప్లస్ కొట్టేలా కనిపించిన టీమిండియా అనూహ్యంగా 330కే కుప్పకూలింది.
An entertaining 32(22) from Richa Ghosh comes to an end 👏
She added a valuable 54 runs for the 5th wicket with Jemimah Rodrigues💪
3⃣0⃣0⃣ up for #TeamIndia🎯
Updates ▶ https://t.co/VP5FlL2S6Y#WomenInBlue | #CWC25 | #INDvAUS | @13richaghosh | @JemiRodrigues pic.twitter.com/JhrLmQO2fE
— BCCI Women (@BCCIWomen) October 12, 2025