హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : గోశాలల సంరక్షణకు ప్రభుత్వం గోశాల పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నదని పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ వెల్లడించారు. గురువారం పశుసంవర్ధకశాఖ, తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో గోశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని ఎనికపల్లిలో రూ.157 కోట్లతో, వేములవాడలో, యాదగిరిగుట్ట, వెటర్నరీ యూనివర్సిటీలో గోశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.