నిడమనూరు, ఏప్రిల్ 18 : నిడమనూరు మండలం కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ శేషరాజు సంధ్యా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మోహన్ కృష్ణ, నాయకులు ఉన్నం సత్యనారాయణ, మేరెడ్డి వెంకట రమణ, చర్క శ్రీను తదితరులు పాల్గొన్నారు.