మర్రిగూడ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించా లని ఆదేశాలు ఇవ్వడంతో సోమవారం టీఆర్ఎస్ పార్టీ, రజక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్షీకి ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటయోధులకు ప్రత్యేక రాష్ట్రంలో సముచిత గౌరవం దక్కిందన్నారు.
కార్యక్రమంలో సహకార చైర్మన్ పందుల యాదయ్యగౌడ్, సర్పంచ్‌లు నల్ల యాదయ్య, కల్లు స్వాతి నవీన్ రెడ్డి,ఎంపీటీసీ శిలువేరు విష్ణు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కొల్కులపల్లి యాదయ్య, నూకల అంజయ్య, టీఆర్ఎస్వీ నాయకులు కొంపెల్లి నాగరాజు, వట్టికోటి శేఖర్, ఐతరాజు స్వామి, సురిగి సందీప్, రాఘవేందర్, జర్పుల రవి, వెంకటంపేట శేఖర్, పగడాల తిరుమలేశ్, రాములు పాల్గొన్నారు.