హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): పెండిం గ్ కేసులను నిర్దేశిత గడువులోగా పరిషరించి, ‘సర్’-2026 ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణలో గుర్తించిన అనామలిస్, నో మ్యాపింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిషరించాలని సూచించారు. హైదరాబాద్ బీఆర్కే భవనంలోని తన కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ‘సర్’ పురోగతిని సమీక్షించారు.
బూత్ లెవల్ ఏజెంట్లు నోటీసుల జారీ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని సూచించారు. బీఎల్ఏల పాత్ర బీఎల్వోలకు ఇండ్లను గుర్తించడంలో సహకరించడానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ఈఆర్వో స్థాయి లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎ లాంటి జాప్యం లేకుండా పరిషరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైనచోట కంప్యూటర్ ఆపరేటర్లను అదనంగా నియమించి పెండింగ్ పనిని తగ్గించాలని సూచించారు.