మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి.. | బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, ఈ మేరకు వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రం సమాచారం ఇచ్చింది.

న్యూఢిల్లీ : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, ఈ మేరకు వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రం సమాచారం ఇచ్చింది. యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఆదేశాలు వచ్చాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే బలవంతంగా డెప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించింది.
1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలచినట్లు, ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం శుక్రవారం సమాచారం పంపింది. తక్షణమే ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం ఢిల్లీలోని డీఓపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆయనకు సూచించింది. మే 31 నాటికి ఆయనకు 60 ఏళ్లు నిండనున్నాయి. వాస్తవానికి సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 12న మమత ప్రధానికి లేఖ రాశారు.
ఈ మేరకు మూడు నెలల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది. బంధోపాధ్యాయ్ గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ శుక్రవారం జరిపిన సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లు ఆదేశాలు రావడానికి వెనుక కారణం ఇదేనేమోనని చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

