యువతిగా నటిస్తూ హనీట్రాప్
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ హనీట్రాప్‌ను చార్మినార్ జోన్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఖరే సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అతని నేరచరిత్రను వివరించారు.
- వందల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
- నిందితుడి ఫోన్లో వేలకొద్ది వాట్సాప్ చాటింగ్‌లు
- హనీట్రాప్‌ను ఛేదించిన చార్మినార్ జోన్ పోలీసులు
సోషల్ మీడియాలో అమ్మాయిలా నటిస్తూ.. తన వలలో చిక్కినవారిని నగ్న ఫొటోలతో బెదిరింపులకు, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేశాడు.. ఇలా అతని వలలో వందలమందికి పైగా పడి మోసపోయారు… ఇందులో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ హనీట్రాప్‌ను చార్మినార్ జోన్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఖరే సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అతని నేరచరిత్రను వివరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండబత్తుల పవన్‌కుమార్ అనే యువకుడు ప్రస్తుతం కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్నాడు. కొంతమంది యువతుల పే ర్లతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నకిలీ ఖాతాలను సృష్టించి సైదాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ ఖాతాల ద్వారా వివిధ వ్యక్తులకు ఫ్రెండ్ లేదా ఫాలో రిక్వెస్ట్‌లు పంపి, వారిలో అమ్మాయిలా చాటింగ్ ప్రారంభించి.. క్రమంగా లైంగిక సంభాషణల వైపు మళ్లిస్తాడు. ఆ తర్వాత ఇతరుల నగ్న చిత్రాలను పంపి, బాధితుల నుంచి కూడా వారి నగ్నఫొటోలను సేకరిస్తాడు.
ఇలా సేకరించిన నగ్న ఫొటోలు, వీడియోలను తన ఫోన్లో , ఇతర సోషల్‌మీడియా ఖాతాలలో భద్రపరుస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి.. పవన్‌ను తన అన్నగా చాటింగ్‌లో పరిచయం చేస్తుంది. ఆ రకంగా పవన్ రంగంలోకి దిగి కాల్స్, వాట్సాప్, సోషల్‌మీడియా ద్వారా బాధితులను సంప్రదిస్తాడు. కొందరిని వ్యక్తిగతంగా కూడా కలుస్తాడు. బాధితుల నగ్నఫొటోలు, వీడియోలను చూపిస్తూ తన చెల్లెలితో పీఎస్‌లో ఫిర్యాదు చేయిస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు. ప్రధానంగా యువకులతో పరిచయం పెంచుకుని నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. నగ్నఫొటోలు బయటపెడతానంటూ నిందితుడు పలువురిని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోషల్‌మీడియాలో చాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని పోలీసు అధికారిని ట్రాప్ చేసినట్లు గుర్తించామని, యువతి సోదరుడుగా పరిచయం చేసుకుని వసూళ్లకు పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు. నిందితుడు చేసిన పలు నేరాల కారణంగా మొత్తం రూ.25.16లక్షల మేర బాధితులు నష్టపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.
వెయ్యిమంది వ్యక్తులతో చాటింగ్..!
నిందితుడు తన నకిలీ ఖాతాల్లో ఎక్కువగా కోల్‌కతాకు చెందిన చందన అనే అమ్మాయి ఫొటోలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి ఆ అమ్మాయిని అప్రమత్తం చేశామని డీసీపీ తెలిపారు. నిందితుడు వెయ్యి మందికిపైగా వ్యక్తులతో చాటింగ్ చేసినట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు. 82 మందికి వారి నగ్నఫొటోలు, వీడియోలు పంపించారని, 13 ఫేక్ ఇన్స్టాగ్రామ్, 14 ఫేక్ ఫేస్బుక్ ఐడీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. బాధితుల్లో ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన వారితో పాటు దుబాయ్, టర్కీ, పాకిస్తాన్, కెనడా దేశాలకు చెందిన వారు తొమ్మిదిమంది ఉన్నారన్నారు. నిందితుడి నుంచి మూడు సెల్ఫోన్లు, 3 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హనీట్రాప్‌లో చిక్కుకున్నవారిలో డాక్టర్లు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లు, ప్రైవేటు ఉద్యోగులు, డెలివరీబాయ్స్, గిగ్ డ్రైవర్లు ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో వేలాది వాట్సాప్ చాటింగ్‌లు ఉన్నాయని, నిందితుడి జాబితాలో వందల మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారిని బ్లాక్మెయిల్ చేసిన క్రమంలో ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశంలో చార్మినార్‌జోన్ అడిషనల్ డీసీపీ మజీద్, సైదాబాద్ డివిజన్ ఏసీపీ సోమవెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

