
మెహిదీపట్నం, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం విజయ్‌నగర్ కాలనీలో కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్, డివిజన్ల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గోప అభిషేక్‌రాజ్, నాయకులు యూసుఫ్, ఇక్బాల్ పాల్గొన్నారు.
చార్మినార్, డిసెంబర్ 20 : రైతులపై కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చార్మినార్ సమీపంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మొఘల్‌పురా డివిజన్ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ, మాజీ అధ్యక్షుడు గోపీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 20 : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంభిస్తున్న విధానాలను తప్పుపడుతూ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తిరుపతి శివకుమార్ ఆధ్వర్యంలో పాతబస్తీలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.