సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రంగా థియేటర్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
– వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు డిమాండ్
కోదాడ, అక్టోబర్ 23 : భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రంగా థియేటర్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాల వల్ల దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లు రద్దు అయినట్లు తెలిపారు. మోదీ సర్కారు నాలుగోసారి అధికారంలోకి రావడం కోసం కీలుబొమ్మలాంటి జ్ఞానేష్ కుమార్‌ను అడ్డం పెట్టుకుని 14 కోట్ల ఓట్లు తొలగించారని ఆయన విమర్శించారు. దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉంటారని, అయితే పార్లమెంట్లో తన మంద బలాన్ని ఉపయోగించుకు సీఈసీ నియామకంలో సీజేఐని తొలగించి మోదీ సర్కార్ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.
ప్రజాస్వామ్యం కోసం, ఓటు హక్కు కోసం పోరాడుతున్న నాయకుల పైన లాఠీచార్జీ, అక్రమ కేసులు మోపుతున్నారని విమర్శించారు. తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మీద వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ, సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం.ముత్యాలు, కౌల్దారు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు షేక్ సైదా, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి, రైతు సంఘం నాయకులు అలసగాని బ్రహ్మయ్య, రాపోలు సూర్యనారాయణ, నాగాటి రాములు, సోంపంగు రాధాకృష్ణ, జంగాపల్లి శీను, కలయాసన్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

