కాసిపేట : తక్షణమే ఆదివాసీ గూడాల్లో సీసీ రోడ్లు( CC Roads) వేయాలని సీపీఎం( CPM ) నాయకురాలు సిడం జంగు బాయి ( Sidam Jangubai ) డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడాల్లో సీపీఎం ఆధ్వర్యంలో పర్యటించి ఆదివాసులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
ఆదివాసులు నివాసం ఉంటున్న గూడాల్లో సీసీ రోడ్లు వేయాలని కోరారు. మల్కెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతంలోని గూడాల్లో సీసీ రోడ్లు లేక బురద రోడ్లపైనే ఆదివాసీలు ఏళ్ల తరబడి నడవాల్సి వస్తుందని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతంలోని వాడల్లో రోడ్లు వేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందన్నారు. రోడ్లు వేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు ఆత్రం సుజాత, అర్క రాంబాయి, ఆత్రం మారు, ఆత్రం మణి, ఆత్రం పుత్లీబాయి తదితరులు పాల్గొన్నారు.