అనంతగిరి, మార్చి 14 : అనంతగిరి మండలంలోని లక్కవరంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రెండవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ఆళ్ల నవ్య సురేందర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవరపల్లి లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి త్రివేణి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బుర్ర నర్సింహారెడ్డి, గ్రామ పెద్దలు బుర్ర పుల్లారెడ్డి, వార్డు సభ్యులు మంద భవాని, మంద వెంకటేశ్వర్లు, ఇలవల రమాదేవి, సురేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కబీర్ సాహెబ్ పాల్గొన్నారు.