హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేసిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఖండించారు.
ఇదే అంశంలో ధర్నాకు దిగిన విద్యార్థులపై సోమవారం కేంద్రం, పోలీస్ బలగాలు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మండిపడ్డారు. పేపర్ లీకులపై కేంద్రం జవాబుదారీగా వ్యవహరించాల్సింది పోయి విద్యార్థులపై కేసులు నమోదు చేయడం సమర్థనీయం కాదన్నారు. వారిపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.