గద్వాల అర్బన్, సెప్టెంబర్ 11 : జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లిలో కులాంతర వివాహం నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులు, యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేపల్లికి చెందిన బోయ మహేశ్వరి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా.. సొంతూరుకు చెందిన దళిత యువకుడిని వివాహం చేసుకొని రాజధానిలో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
దీంతో యువతి కుటుంబ సభ్యులు గురువారం గ్రామంలోని యువకుడి ఇంటిని జేసీబీతో కూల్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి కారణమైన ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.