హైదరాబాద్ : మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో కేర్ అండ్ కెరీర్ చారిటీస్ (Care and Career Charities) సంస్థ చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నది. కేర్ అండ్ కెరీర్ చారిటీస్ చైర్మన్ సీహెచ్ చిదంబరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని స్వరాజ్య ప్రెస్ కాంపౌండ్ ఆవరణలో సుమారు 600 మందికి ఉచిత కంటి పరీక్షలు(Free eye camp) నిర్వహించారు.
అలాగే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు కాట్రపాటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. శరీరంలోని అన్ని భాగాల్లో కండ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కంటి చూపు మందగిస్తే ఒకరిపై ఆధారపడి జీవించాల్సి ఉంటుంద న్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు. కేర్ అండ్ కెరీర్ చారిటీస్ తరఫున కొన్ని సంవత్సారాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
పద్మారావు నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి సందర్భంగా రోగులకు పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశామని వివరాలు వెల్లడించారు. అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి బేగంబజార్లోని కిశోర్ చంద్ కార్డియా హాస్పిటల్లో శస్త్రచికిత్సలు చేయిస్తు న్నామని చెప్పారు. రోగులకు నెలకు సరిపడా మందులు సైతం ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు. సేవే భాగ్యం అని నమ్ముతూ కేర్ అండ్ కెరీర్ చారిటీస్ వైద్య సేవలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
రోగులను పరీక్షిస్తున్న వైద్యులు