సోన్ : సోన్ మండలంలో తాసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆరిఫా సుల్తానాకు చెందిన కారు శుక్రవారం గంజాల్ టోల్‌ప్లాజా వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆమె తలకు, చేయికి గాయాలయ్యాయి. నిర్మల్ నుంచి సోన్‌లోని విధులకు హాజరయ్యేందుకు గంజాల్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే కోతులు అడ్డురావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారు డ్రైవర్‌తో పాటు తాసీల్దార్‌కు గాయాలు కావడంతో స్థానికులు ఇద్దరిని బయటకు తీసి నిర్మల్ ఏరియా దవాఖానకు తరలించారు.
ఈ మేరకు సోన్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో రమేశ్ రాథోడ్ దవాఖానకు చేరుకొని ఇరువురిని పరామర్శించారు.