Suryakumar Yadav : పొట్టి ప్రపంచకప్ కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న భారత జట్టు సన్నాహక సిరీస్‌ను విజయంతో ముగించాలనుకుంటోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విక్టరీలతో ట్రోఫీని పట్టేసిన టీమిండియా.. చివరి టీ20లో గెలుపుపై ధీమాతో ఉంది. శుక్రవారం కేరళలో అడుగుపెట్టిన కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతం గంభీర్ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మామూలుగా క్రికెటర్లను చూసి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ, ఈసారి టీమిండియా సారథి సూర్య బాడీగార్డ్‌లా మారి అందర్నీ నవ్వించాడు.
ఇంతకూ సూర్య ఏం చేశాడంటే.. ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కోసం భారత జట్టు కేరళ చేరుకుంది. అక్కడి తిరువనంతపురం విమానాశ్రయంలో దిగిన టీమిండియా క్రికెటర్లు.. బయటకు వస్తుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన హడావిడి చూస్తే ఎవరికైనా నవ్వాగదు. లోకల్ బాయ్ సంజూ శాంసన్ (Sanju Samson)కు బాడీగార్డ్‌లా మారిపోయిన అతడు ‘దారి ఇవ్వండి.. చేటా (మలయాళంలో చేటా అంటే అన్న అని అర్ధం) వస్తున్నాడు’ అంటూ అందర్ని పక్కకు జరగమని చెప్పాడు.
When Captain Suryakumar Yadav welcomes Sanju Samson in his hometown, you know the vibes are immaculate 😂❤️
Pure friendship, pure banter, pure Team India energy 🇮🇳#TeamIndia #INDvNZ #SanjuSamson pic.twitter.com/pdkKfQp41A
— Arshy (@imArshit) January 30, 2026
అతడలా చేయడం చూసి సంజూ మొహమాటపడుతూనే చిరునవ్వులు చిందించాడు. ఇక భద్రతా సిబ్బంది.. పోలీసులు సైతం సంజూను స్కై ఆటపట్టించిన తీరు చూసి భలే కెప్టెన్.. ఎంత సరదా మనిషి అని మనసారా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఐదు టీ20లో న్యూజిలాండ్‌కు షాకిస్తూ హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా గెలుపొందింది. అయితే.. ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. విశాఖలో 24 పరుగులే ఈ సిరీస్‌లో అత్యధిక స్కోర్. దాంతో.. చివరి మ్యాచ్‌లోనైనా అతడు చెలరేగాలని అభిమానులతో సహా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సొంతగడ్డపై త్రివేండ్రంలో శనివారం జరిగే మ్యాచ్‌లో లోకల్ బాయ్ ఫామ్ అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితం కావొద్దంటే ఈ మ్యాచ్‌లో సంజూ జూలు విదిలించాల్సిందే.