డెయిరీఫామ్‌లో గంజాయి విక్రయాలు
రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలోని గోవిందరావు డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్రపెడ్లర్లను ఈగల్ ఫోర్స్ స్టేట్ టాస్‌ఫోర్స్, పటాన్చెరు పోలీసులు ఆదివారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
- ఇద్దరు బీహార్‌వాసులను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలోని గోవిందరావు డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్రపెడ్లర్లను ఈగల్ ఫోర్స్ స్టేట్ టాస్‌ఫోర్స్, పటాన్చెరు పోలీసులు ఆదివారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.57 వేల విలువైన 1.150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
బీహార్‌కు చెందిన సంచిత్ రాయ్, మహేశ్ కుమార్ అనే ఈ నిందితులు హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు చెందిన కిషన్‌సింగ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి, స్థానికంగా పనిచేస్తున్న వలస కార్మికులకు విక్రయిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. వీరి నుంచి గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన నలుగురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నామని, మరో పది మంది వినియోగదారులను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కిషన్‌సింగ్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bihar
- cannabis
- dairy farm
- marijuana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

