సదాశివుడు స్మృతిలో సాహిత్య పురస్కరాలు
ప్రముఖ కవి, గీత రచయిత మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవాన్ని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఈనెల 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
ప్రముఖ కవి, గీత రచయిత మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవాన్ని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఈనెల 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో ఆరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
డాక్టర్ చమన్ సింగ్, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్‌లకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, విశిష్ట అతిథిగా గోరటి వెంకన్న, ఆత్మీయ అతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరవుతారు.
4న డాక్టర్ బండ సరోజన సంస్మరణ సభ
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, పాఠ్యపుస్తకాల విదూషిమణి దివంగత డాక్టర్ బండ సరోజన సంస్మరణ సభ ఈనెల 4వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి నిర్వహించనున్నామని నిర్వాహకులు కొండపల్లి నీహారిణి, యశోద ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. బండ సరోజనతో అనుబంధం ఉన్న వారంతా వచ్చి ఆమె సేవలను స్మరించుకోవాలని వారు కోరారు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

