గురుకులాల్లో ఎఫ్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించాలి
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల హాజరును ప్రతిరోజూ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా 100 శాతం నమోదు చేయాలని, సామగ్రి పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండరాదని టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి రవి గుగులోత్ ఆదేశించారు.
- టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి రవి గుగులోత్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల హాజరును ప్రతిరోజూ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా 100 శాతం నమోదు చేయాలని, సామగ్రి పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండరాదని టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి రవి గుగులోత్ ఆదేశించారు. ఆదివారం జోనల్ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు (డీసీవోలు), ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన జూమ్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్ఈఆర్పీ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న రెండోజత యూనిఫామ్‌ల పంపిణీలోని వ్యత్యాసాలను సరిదిద్ది సోమవారంలోగా పూర్తి చేయాలని సూచించారు. లిడ్‌క్యాప్ ద్వారా సరఫరా అయిన టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, సాక్స్, ట్రంక్ బాక్సులను వెంటనే విద్యార్థులకు అందించాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమ పథకాలు, డైట్ వంటివి ఎఫ్ఆర్ ఎస్ హాజరుతో ముడిపడి ఉన్నందున నిత్యం హాజరును కచ్చితంగా నమోదు చేయాలని, తరచూ గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇండెంట్, పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలను కొత్తగా రూపొందిచిన మొబైల్ యాప్‌లోనే నమోదు చేయాలని స్పష్టం చేశారు. గురుకులాల నెలవారీ ప్రొవిజన్ల ఇండెంట్ ను ప్రతి నెలా 5వ తేదీలోగా పంపించాలని ఆదేశించారు. 2027 28 విద్యాసంవత్సరానికి అవసరమైన సామగ్రి ఇండెంట్ ను వాస్తవ విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూపొందించి సోమవారంలోగా సమర్పించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

