T20 World Cup 2024 : తొలిసారి టీ20 వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించిన కెనడా(Canada) అదరగొట్టింది. వామప్ మ్యాచ్‌లో బలమైన నేపాల్(Nepal)ను చిత్తుగా ఓడించింది. నికోలస్ కిర్టన్ ఆర్ధ శతకంతో కదం తొక్కగా.. రవీందర్‌పాల్ సింగ్ 41 పరుగులతో రాణించాడు. అనంతరం పేసర్ డిల్లాన్ హెలిగర్స్ నాలుగు(4/20) వికెట్లతో ఆసియా జట్టును బెంబేలెత్తించాడు. దాంతో, కెనడా 63 పరుగుల తేడాతో గెలుపొందింది. మరో వామప్ మ్యాచ్‌ల్లో ఒమన్, నమీబియాలు విజయం సాధించాయి.
ఒమన్ పసికూన పపువా న్యూ గినియా(PNG)పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పీఎన్జీ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఒమన్ కెప్టెన్ అకీబ్ లియాస్ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేశాడు. అనంతరం 138 పరుగుల లక్ష్య ఛేదనలో ఆల్‌రౌండర్ జీషన్ మఖ్సూద్ 42 బంతుల్లో 45 రన్స్‌తో రాణించాడు. చివర్లో మహమ్మద్ నదీమ్(22 నాటౌట్) దంచడంతో ఒమన్ మరో ఐదు బంతులు ఉండగానే మ్యాచ్ ముగించింది.
A solid performance ahead of a debut #T20WorldCup 👊
More on Canada’s win over Nepal in warm-up action 👇https://t.co/dOuAszxcpm
— ICC (@ICC) May 27, 2024
గాండాతో జరిగిన మ్యాచ్‌లో నమీబియా స్టార్ నికో డావిన్(Niko Davin) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో, 135 పరుగుల లక్ష్యాన్ని నమీబియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత రోజర్ ముకాస(51 నాటౌట్), రాబిన్సన్ ఒబుయా(38)లు దంచడంతో ఉగాండా పోరాడగలిగే స్కోర్ చేసింది. కానీ, నమీబియా బ్యాటర్లు నికో, జేజే స్మిత్(21 నాటౌట్)లు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.