Konda Surekha | వరంగల్ పార్టీ ముఖ్యనేతలతో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సమావేశమయ్యారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బర్త్ రఫ్ చేసినప్పుడు కార్యకర్తలు ఆవేశంతో రగిలి పోయారు. వారిని శాంతంగా ఉండాలని కోరాం.. పదవులు వస్తాయి..పోతాయి.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు.
కొండా సురేఖకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పేరు ఉంది. మా వెనుక గుంట నక్కలు ఉన్నాయి. మంత్రి సారయ్యను ఓడించాలనే అప్పుడు తూర్పులో కేసీఆర్ పోటీ చేయాలని సూచించారు. మంత్రిని ఓడించాను.. ఒక జెండాపై గెలిచి… మరో జెండా కిందికి రాలేదని విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్నారు. కొండా మురళి రికమెండ్ చేస్తూ సంతకం చేస్తేనే సుధారాణికి పదవి వచ్చింది.. పదవి వచ్చిన తర్వాత ఆమె కనీసం ఫోన్ కూడా చేయలేదన్నారు.
నేను బర్తరఫ్ అయ్యానని బాధపడటం లేదు.. అకారణంగా నన్ను మంత్రి పదవి నుంచి తొలగించారనేదే నా ఆవేదన అని అన్నారు. అధిష్టానం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి.. ఏ పార్టీలోకి వెళ్లొద్దని కోరారు. కాంగ్రెస్‌లోనే పుట్టాం.. కాంగ్రెస్‌లోనే పెరిగాం. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్ జెండాతోనే పోటీ చేస్తాం. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖదే. మళ్లీ ఇక్కడ గెలుస్తా.. మంత్రిని అవుతా.. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు అని స్పష్టం చేశారు.
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?