రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలోని మణితేజ–లక్ష్మి 2.4 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ ఘటన కలకలం రేపింది. సుమారు రూ.10 లక్షల విలువైన కేబుల్స్ అపహరణకు గురైనట్లు ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో...
– రూ.10 లక్షల విలువైన కేబుల్స్ అపహరణ
– ఆరు నెలల క్రితం రూ.5 లక్షల నష్టం
– వరుస చోరీలతో ఆందోళనలో నిర్వాహకులు.. పోలీసులకు ఫిర్యాదు
ఎర్రుపాలెం, అక్టోబర్ 13 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలోని మణితేజ–లక్ష్మి 2.4 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ ఘటన కలకలం రేపింది. సుమారు రూ.10 లక్షల విలువైన కేబుల్స్ అపహరణకు గురైనట్లు ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్లాంట్‌లోని 200 మీటర్ల RS485 కేబుల్‌తో పాటు 2,000 మీటర్ల Polycab 6 SQ.MM DC కేబుల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. గతంలోనూ ఇదే ప్లాంట్‌లో సుమారు ఆరు నెలల క్రితం రూ.5 లక్షల విలువైన DC కేబుల్స్ చోరీకి గురయ్యాయని తెలిపారు. అప్పట్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతోనే మరోసారి చోరీ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వరుస చోరీలతో తీవ్రంగా నష్టపోతున్నాం
స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సమాజానికి అందించాలనే లక్ష్యంతో సోలార్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నామని బాధితులు తెలిపారు. అయితే, వరుస చోరీల కారణంగా భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్స్ అపహరణతో విద్యుత్ ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి, సమగ్ర విచారణ జరిపి చోరీకి పాల్పడిన వారిని గుర్తించాలని బాధితులు కోరారు. చోరీకి గురైన కేబుల్స్‌ను రికవరీ చేసి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్లాంట్‌కు తగిన భద్రత కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

