కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Puvvada Ajay | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో నెలకొంటున్న కరువు పరిస్థితులు, సాగునీరు, విద్యుత్ కొరతతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంపై గత తొమ్మిది నెలలుగా ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు అవసరమైన నీరు, విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించి, సాగునీరు, విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేం దుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

