ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
ECB : స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ (England) త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్‌లో వైట్‌బాల్ సిరీస్ ఉన్నందున మంగళవారం ఇంగ్లండ్ వేల్స్ బోర్డు(ECB) స్క్వాడ్‌ను ప్రకటించింది.
ECB : ఇటీవలే స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ (England) త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్‌లో వైట్‌బాల్ సిరీస్ ఉన్నందున మంగళవారం ఇంగ్లండ్ వేల్స్ బోర్డు (ECB) స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆసీస్‌తో వన్డే, టీ20ల కోసం హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథిగా పటిష్టమైన స్క్వాడ్‌ను వెల్లడించింది ఈసీబీ. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం విడివిడిగా16 మందితో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కింది. అలానే.. గాయం నుంచి కోలుకున్న జాకబ్ బెథెల్ రెండు ఫార్మాట్ల సిరీస్‌కు ఎంపికవ్వగా.. యువకెరటాలు ఎడీ జాక్, థామస్ రెలు తొలిసారి టీ20 స్క్వాడ్‌లోకి వచ్చారు.
సర్జరీ అనంతరం కోలుకుంటున్న విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్ (Jos Buttler) ఊహించనట్టుగానే ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. పెర్త్‌లో ఇరుజట్ల మధ్య నవంబర్ 13న తొలి వన్డేతో సిరీస్ మొదలవ్వనుంది. అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 15న రెండో వన్డే, నవంబర్ 18న మూడో వన్డేలో ఆసీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఆపై ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 21 నుంచి షురూ కానుంది.
JUST IN: England name their squads for three ODIs and five T20Is against Australia in November 🏴
Eddie Jack and Thomas Rew receive their first senior call-ups for the T20 series, while Jacob Bethell returns from a knee injury.
Jofra Archer is included for the ODIs, having been rested for the Pakistan tri-series.
— Cricinfo (@cricinfo) October 13, 2026
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : హ్యారీ బ్రూక్(కెప్టెన్), బెథెల్, జో రూట్, హెన్రి క్రొకొంబె, సామ్ కరన్, లియాం డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బ్యాంటన్.
ఇంగ్లండ్ టీ20 స్క్వాడ్ : హ్యారీ బ్రూక్(కెప్టెన్), టామ్ బ్యాంటన్, జాకబ్ బెథెల్, జేమ్స్ కోల్స్, జోర్డన్ కాక్స్, హెన్రీ క్రొకొంబె, సామ్ కరన్, లియాం డాసన్, అనేరిన్ డొనాల్డ్, ఎడీ జాక్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, థామస్ రే, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

