INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
INDIA Bloc : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 11 ప్రతిపక్ష పార్టీలు దీనికి సంతకం చేయగా.. నాలుగు పార్టీలు దూరంగా ఉన్నాయి.
INDIA Bloc : కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జట్టుకట్టిన ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు కొనసాగుతున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, అలాగే, ఎన్నికల సంఘంలో అవకతవకలపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 11 ప్రతిపక్ష పార్టీలు దీనికి సంతకం చేయగా.. నాలుగు ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నాయి.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే ఈ పిటిషన్‌కు దూరంగా ఉన్నాయి. ఇండియా బ్లాక్‌లో లేకపోయినప్పటికీ.. ఎన్డీయే, బీజేపీకి ప్రత్యర్థి పార్టీలైన నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజూ జనతా దళ్ (బీజేడీ), విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ కూడా ఈ పిటిషన్‌కు దూరంగా ఉంది. ఈ పార్టీలన్నీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేసినవే. కానీ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే సమయంలో మాత్రం దూరంగా ఉన్నాయి.
అందులోనూ ఇండియా బ్లాక్ కూటమిలోనే ఉన్న డీఎంకే, ఆప్‌లు పిటిషన్‌కు దూరంగా ఉండటంతో ఈ కూటమిలో విబేధాలు ఇంకా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి, డీఎంకేకు మధ్య విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ టీవీకే పార్టీకి మద్దతిచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో డీఎంకే.. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటోంది. అలాగే, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా పలు రాష్ట్రాల్లో విబేధాలున్నాయి. దీంతో ఆప్ కూడా ఇండియా బ్లాక్ సమావేశాలకు దూరంగా ఉంటోంది.
బీజేడీకి సంబంధించిన సర్ ప్రక్రియను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వ్యతిరేకిస్తున్నారు. జ్ఞానేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ర్యాలీలో కూడా బీజేడీ ఎంపీలు పాల్గొన్నారు. కానీ, తాజా పిటిషన్‌కు మాత్రం దూరంగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

